Srisailam : శ్రీశైలం ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయం నిండుకుండలా మారింది

Update: 2025-08-25 03:34 GMT

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయం నిండుకుండలా మారింది. గత కొద్ది రోజుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈరోజు కూడా వరద శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

పది గేట్లు ఎత్తి...
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన పది గేట్లు 14 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,38,739 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 4,05,124 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News