Srisailam : కృష్ణానదికి పోటెత్తిన వరద.. ప్రాజెక్టులు గేట్లు ఎత్తి
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు పది గేట్లు పది అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు పది గేట్లు పది అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 3,39,496 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు వరద నీరు పెరగడంతో ఇరవై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి కొనసాగుతుంది.
కృష్ణానదికి భారీగా వరద నీరు...
కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుతుండటండంతో దాని ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. అనేక జలాశయాల గేట్లను ఎత్తివేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అనేక జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తారు. జూరాల, ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశంబ్యారేజీల వద్ద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దసరా సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టుల వద్దకు వస్తారని భావించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.