నేడు మిధున్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో విచారణ జరగనుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో మిధున్ రెడ్డి అరెస్ట్ అయి దాదాపు 72 రోజులకు పైగానే రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మిధున్ రెడ్డికి ఇటీవల ఏసీబీ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సిట్ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు.
నేడు హైకోర్టులో...
దీనిపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మిధున్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. దీనిపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు ఇప్పటికే ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. నలుగురి బెయిల్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.