Andhra Pradesh : ఏసీబీ కోర్టులో నేడు విచారణ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది

Update: 2025-10-08 02:27 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. తనకు యూఎస్ వెళ్లేందుకు పాస్ పోర్టు ఇవ్వాలని మిధున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటీషన్ వేశారు. పార్లమెంటు కమిటీతో పాటు తాను కూడా యూఎస్ వెళ్లే బృందంలో ఉన్నందున తనకు అనుమతివ్వాలని పిటీషన్ లో కోరారు.

బెయిల్ పిటీషన్ పై...
అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో పాటు ఏ 8 నిందితుడిగా ఉన్న చాణక్య బెయిల్ పిటీషన్లపై కూడా నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో పాటు తమకు ఇచ్చిన బెయిల్ షరతులను సడలించాలంటూ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది.


Tags:    

Similar News