Gorantla Madhav : నేటి నుంచి పోలీసు కస్టడీలోకి గోరంట్ల మాధవ్
నేటి నుంచి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు
నేటి నుంచి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. గోరంట్ల మాధవ్ ను ఐదు రోజులు కస్టడీకి అడిగితే గుంటూరు న్యాయస్థానం రెండు రోజులు మాత్రమే విచారణకు అనుమతిచ్చింది. దీంతో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ ను గుంటూరుకు తీసుకు వచ్చి పోలీసులు విచారించనున్నారు.
చేబ్రోలు కిరణ్ పై...
ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేసిన సమయంలో అతనిపై దాడి చేయడానికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించారన్నది పోలీసుల అభియోగం. అదే సమయంలో పోలీసుల విధులకు కూడా అడ్డుపడ్డాడన్న కారణంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో నేడు, రేపు నగరం పాలెం పోలీసులు గోరంట్ల మాధవ్ ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.