జగన్ గుడ్ న్యూస్.. వారంతా హ్యపీ

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2023-04-18 02:34 GMT

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 నోటిఫికేషన్లో ఎంపికై రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవడంతోపాటు అర్హత పరీక్ష పాసైన వారికి ప్రొబేషన్ ఇచ్చింది. వీరికి మే 1 నుంచే పెంచిన జీతం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్క కు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులున్నా...
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్ గ్రామ వార్డు సచివాలయాలలో రెండు విడతలలో నియామకం పొంది, డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అయిన అందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయడం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ఆయనకున్న అభిమానానికి నిదర్శనమని వారు చెబుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.


Tags:    

Similar News