Gorantla : ఆ టిక్కెట్ నాదే.. చంద్రబాబు ప్రకటిస్తారు
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టిక్కెట్ తనదేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు
tdp mla gorantla butchaiah chaudhary
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టిక్కెట్ తనదేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ రెండు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. తన సీటు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రాజమండ్రి రూరల్ టిక్కెట్ ను జనసేన తరుపున కందుల దుర్గేష్ కు ఇచ్చారన్న ప్రచారంలో వాస్తవం లేదని బుచ్చయ్య చౌదరి తెలిపారు.
వాస్తవం లేదు...
దీనిపై త్వరలోనే చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేస్తారని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అందుకే ఎవరూ టీడీపీ కార్యకర్తలు కాని, తన అనుచరులు కానీ ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, కొంత సమయం వేచి చూస్తే అంతా సర్దుకుపోతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ ద్వారా వెల్లడించారు.