6 నెలల ముందు నిర్ణయం.. వారిని మార్చేస్తా

గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ హాట్ హాట్ గా సాగింది. ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం ముగిసింది.

Update: 2022-09-28 12:20 GMT

గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ హాట్ హాట్ గా సాగింది. ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం ముగిసింది. 27 మంది ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ పీకినట్లు తెలిసింది. పేర్లతో సహా జగన్ ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.175 సీట్లు టార్గెట్ గా ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇన్ ఛార్జులకు దిశానిర్దాశం చేశారు. 27 మంది నేతల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ వేచి చూస్తానని, అప్పటికీ పనితీరు మార్చుకోకపోతే వారిని మార్చేందుకు కూడా వెనుకాడబోనని జగన్ వార్నింగ్ ఇచ్చారు. గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా జగన్ ఎమ్మెల్యేలకు చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనిత, ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు, ఆర్కే రోజా, శిల్పా చక్రపాణిరెడ్డిల పనితీరు పై జగన్ అసంతృప్తి వ్యకత్ం చేసిన్టలు తెలిసింది.

ఎన్నికల వరకూ...
జగన్ ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు పూర్తిగా నిరాశ జనకంగా ఉందని ఆయన అన్నారు.27 మంది 38 రోజుల్లో కేవలం పదహారు రోజులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని జగన్ చెప్పారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని జగన్ సూచించారు. వ్యాపారంలాగా కాకుడా వృత్తిగా రాజకీయాన్ని చూడాలన్నారు. ప్రతి ఇల్లును వంద శాతం టచ్ చేయాలని, వారానికి నాలుగు రోజులు ఖచ్చితంగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నాలని జగన్ సూచించారు. ఎన్నికల వరకూ ఈ కార్యక్రమం జరుగుతూనే ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ పూర్తి సమయాన్ని రాజకీయం కోసం వెచ్చించాలని కోరారు. మీరందరూ తనతో పాటే మళ్లీ అసెంబ్లీకి రావాలని జగన్ ఆకాంక్షించారు. ఎవరూ కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయవద్దని ఆయన సూచించారు. తిరిగి నవంబరు నెలలో మరోాసారి సమావేశమవ్వాలని జగన్ నిర్ణయించారు. 


Tags:    

Similar News