కోటంరెడ్డి రికార్డు బ్రేక్ శంకుస్థాపనలు.. ఒకే రోజు 105 పనులు
మార్చి 9న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట ఐదు పనులకు శంకుస్థాపనల కార్యక్రమం జరగనుంది
మార్చి 9న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట ఐదు పనులకు శంకుస్థాపనల కార్యక్రమం జరగనుంది. చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కార్యకర్తల కష్టం, కన్నీళ్లు తనకు తెలుసునని, కార్యకర్తల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వారికోసం ఎందాకైనా వస్తానని కోటంరెడ్డి కార్యకర్తల సమావేశంలో తెలిపారు. ప్రజలకు పనికివచ్చే పనులు చేయాలని, రాజకీయ వేధింపులు వద్దని పిలుపు నిచ్చారు.తొమ్మది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పనులకు 191 కోట్ల నిధులు చంద్రబాబు మంజూరు చేశారని కోటంరెడ్డి తెలిపారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా...
భారతదేశ చరిత్రలో ఒకేరోజు 105 శంకుస్థాపనలు చేస్తున్నామని. స్థానిక ప్రజలే శంకుస్థాపకులు చేస్తారని, ఉదయం 6:30 కే తొలి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 51 పనులకు తానే స్వయంగా శంకుస్థాపలను చేస్తానని, 54 చోట్ల కూటమి పార్టీ నేతలతో కలసి తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కేవలం 60 రోజుల్లో ఈ పనులను పూర్తిచేసి, ప్రజలచేతే ఘనంగా ప్రారంభోత్సవాలు చేస్తామని, రాష్ట్రానికే ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నిలుపుదామని శ్రీధర్ రెడ్డి తెలిపారు.