నేడు బెజవాడ పోలీసుల ఎదుటకు గోరంట్ల మాధవ్
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. అనంతపురం నుంచి ఆయన బయలుదేరి విజయవాడ చేరుకుని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. పోక్సో కేసులో యువతి పేరును బహిరంగ పర్చారంటూ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నోటీసులు ఇచ్చి...
ఈ మేరకు ఈ నెల 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని కొంతకాలం క్రితం నోటీసులు ఇచ్చారు. తన న్యాయనిపుణులతో సంప్రదించిన అనంతరం విచారణకు హాజరు కావాలని గోరంట్ల మాధవ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన అనంతపురం నుంచి బయలుదేరి ఈరోజు విజయవాడకు చేరుకోనున్నారు.