Kesineni Nani : వరస ట్వీట్లతో కేశినేని నాని వదలడం లేదుగా? విశాఖ ఫర్ సేల్ అంటూ?
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వరస ట్వీట్లతో తన సోదరుడు కేశినేని చిన్నిపై యుద్ధం చేస్తున్నారు
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వరస ట్వీట్లతో తన సోదరుడు కేశినేని చిన్నిపై యుద్ధం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కేశినేని నాని తాను ట్వీట్లు చేస్తూ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాధ్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖలో కారు చౌకగా భూములు కొట్టేసిన ఉర్సా కంపెనీ కేశినేని చిన్నికి చెందిందని ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
డాక్యుమెంట్లతో సహా...
అదే సమయంలో అనేక దందాలు చేస్తున్న కేశినేని చిన్ని ఉచ్చులో పడవద్దంటూ టీడీపీ నాయకత్వాన్నికూడా కేశినాని నాని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈరోజు విశాఖ పర్ సేల్ అంటూ మరో ట్వీట్ చేశారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా నన్ను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా చిప్ దో ... ది అన్నా సైకో అన్నా నో ప్రాబ్లెమ్ ఒకటైతే ఖాయం.. విశాఖ ఫర్ సేల్ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని వ్యాపారంలో మోసాలంటూ డాక్యుమెంట్లతో సహా ఎక్స్ లో పోస్టు చేశారు.