Kesineni Nani : కేశినేని నాని మరో సంచలన ట్వీట్
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన ట్వీట్ చేశారు.
mp kesineni nani
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి ట్వీట్ చేశారు. తన సోదరుడు చిన్నిపై మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని కేశినేని చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఇసుక దందాలతో పాటు గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారని, మద్యం ద్వారా అక్రమార్జనకు పాల్పడుతున్నారని కేశినేని నాని ఫైర్ అయ్యారు.
ఎన్టీఆర్ పేరును తొలగించి...
అందుకే కేశినేని నాని చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు తొలగించి ఛార్లెస్ శోభరాజ్ పేరు పెట్టాలంటూ కేశినేని నాని తాజాగా ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, దీనికి సంబంధించి తాను వివరాలను త్వరలో బయటపెడతానని కూడా కేశినేని నాని ట్వీట్ చేశారు