కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఇలా : చింతామోహన్

కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల మూసివేస్తున్న పరిస్థితులు ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు

Update: 2025-06-27 07:41 GMT

కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల మూసివేస్తున్న పరిస్థితులు ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. గుంటూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదవాడికి చదువుని దూరం చేస్తున్నారని , ఓబీసీ లకు చంద్రబాబు ఏమి చేశారంటూ ప్రశ్నించారు. ఒక ఓబీసీ మహిళను చెట్టుకి కట్టేసి కొట్టిన పరిస్థితి కుప్పం నియోజవర్గం లో ఉందన్న చింతామోహన్ తెనాలిలో దళిత యువకులను రోడ్ మీద కొట్టారని, గిరిజనలుపై కూడా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.

అమరావతిలో దేవుళ్లు ఏరీ?
వక్స్ బోర్డ్ చట్ట సవరణకు చంద్రబాబు సపోర్ట్ చేశారని, అమరావతి లో ఒక్క దేవుడు కనిపించలేదన్న చింతా మోహన్ దేవతల రాజధాని అని మాత్రం చెప్తున్నారుకానీ అక్కడ దేవుళ్ళు దేవతలు మాత్రం కనపడడం లేదని ఎద్దేవా చేశారు. 26 జిల్లాలో ఉన్న వారిలో రాయలసీమ ప్రజలు అమరావతిని ఇష్టపడటం లేదని చింతా మోహన్ అన్నారు. రాయలసీమ నాయకులు ఉద్యమాలు మొదలుపెట్టారని, రాజధాని నిర్మాణానికి వెయ్యి ఎకరాలు చాలని, రాజధాని రైతులకు ఏమి చేశారు చెప్పాలని చింతా మోహన్ ప్రశ్నించారు. కార్పొరేట్ రాజధానిగా అమరావతి మారిందన్నారు.


Tags:    

Similar News