Kethireddy Peddareddy : పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తుండగా పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పుట్లూరు రహదారిలో జరిగే ఒక కార్యక్రమానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరవుతున్నారని తెలిసి పోలీసులు నిలువరించడంతో ఆయన అక్కడే ఉండిపోయారు. తాను పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చానని, అయినా తనను అడ్డుకోవడమేంటని పెద్దారెడ్డి ప్రశ్నించారు.
వివాహ కార్యక్రమానికి...
అదే వివాహ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పరిణామంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోనికి రానివ్వకుండా అడ్డుకుని పంపించి వేశారు.