Tadipathri : పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు

Update: 2025-08-18 04:38 GMT

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. తాడిపత్రికి వెళ్లనివ్వకుండా నారాయణరెడ్డి పేట వద్ద ఆయనను అడ్డుకున్నారు. తాడిపత్రికి వెళితే అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుందని భావించి తాము వెళ్లనివ్వబోమని పోలీసులు చెబుతున్నారు. మరొకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి భారీగా టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు.

తాడిపత్రికి వెళ్లనివ్వకుండా...
పది గంటల నుంచి పదకొండు గంటల మధ్య తాడిపత్రికి పోలీసులు దగ్గరుండి పెద్దారెడ్డిని తీసుకెళ్లాలని హైకో్ర్టు స్పష్టంగా ఆదేశించిందని, అయినా సరే పోలీసులు శాంతి భద్రతలను సమస్య బూచిగా చూపి తనను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇక న్యాయస్థానాల ఆదేశాలను కూడా ఇక్కడి పోలీసులు అమలు చేయడం లేదని అంటున్నారు.


Tags:    

Similar News