మద్యం స్కాం కేసులో సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్యం స్కాం కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-04-18 11:57 GMT

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్యం స్కాం కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. మూడు గంటల పాటు తనను ప్రశ్నించారని అన్న సాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి మద్యం స్కాం కేసులో కీలక పాత్రధారి అని అన్నారు. రాజ్ కసిరెడ్డి తననే మోసం చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రాంతీయ పార్టీలో నెంబరు 2 స్థానం అనేది లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. మద్యం విషయంలో హైదరాబాద్, విజయవాడల్లో తన ఇంట్లోనే రెండు సమావేశాలు జరిగాయని తెలిపారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు మీటింగ్ లలో పాల్గొన్నారని సాయిరెడ్డి చెప్పారు. అడాన్ కంపెనీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదన్న విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి క్రిమినల్ అని తెలియక తాను పార్టీ పెద్దలకు పరిచయం చేశానని చెప్పారు.

వైసీపీలో నెంబరు టూ అనేది...
వైసీపీలో తాను నెంబరు 2 అనేది మిథ్య అని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలకు తాను పార్టీలో రెండు వేల స్థానాలకు పడిపోయానని తెలిపారు. రెండు సమావేశాల్లో లిక్కర్ సమావేశాలపై చర్చ జరిగిందని తెలిపారు. రాజ్ కసిరెడ్డి చేసిన వసూళ్లు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని సిట్ అధికారులకు చెప్పానని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్ కసిరెడ్డి అతి పెద్ద క్రిమినల్ అని, దీనికి సమాధానం ఆయనే చెప్పాల్సి ఉందన్నారు. విచారణకు రమ్మంటే మరోసారి వస్తానని తాను సిట్ అధికారులకు చెప్పానని విజయసాయిరెడ్డి తెలిపారు. కోటరీ వేధింపులకు భరించలేకనే తాను వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు. అరబిందో నుంచి తాను వంద కోట్ల రూపాయలు అప్పు ఇప్పించానని సాయిరెడ్డి తెలిపార. మూడు కంపెనీలు రాజ్ కసిరెడ్డి లీజుకు తీసుకున్నారని అన్నారు.





















Tags:    

Similar News