న్యాయవ్యవస్థపై మోదుగుల సంచలన వ్యాఖ్యలు

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2022-03-03 11:52 GMT

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదన్నారు. అదే తమకు అవసరమైన అంశాలపైనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని మోదుగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థలో ఏది గొప్ప అనే దానిపై చర్చ జరగాలని మోదుగుల డిమాండ్ చేశారు.

ఆ పిటీషన్లు ఎందుకు పట్టించుకోలేదు.....
న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలన్నారు. న్యాయవ్యవస్థ నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్నే అవమానపరుస్తారా? అని మోదుగుల నిలదీశారు. రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుసునని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. ఈ విజభన పాపంలో బీజేపీ పాత్ర కూడా ఉందని చెప్పారు. రాష్ట్ర విభజనపై వేసిన పిటీషన్లపై ఎందుకు విచారణ జరగడం లేదని ఆయన నిలదీశారు. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టులో పిటీషన్ వేసినా ఇంతవరకూ ఎందుకు పట్టించుకోలేదన్నారు. 2019 లో వేసిన పిటీషన్ కు ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. తొలుత రాష్ట్ర విభజన పిటీషన్లపై తీర్పులు ఇవ్వాలన్నారు.


Tags:    

Similar News