Breaking : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్?

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2025-04-10 12:42 GMT

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఎస్సీ కార్యాలయంలో హడావిడి చేసిన గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా మాధవ్ వెంబడించారు.

కారులో వెంబడించడమే కాకుండా...
తన కారులో ఆయన వెంబడించడమే కాకుండా ఎస్కార్ట్ వాహనాన్ని కూడా అడ్డగించారు. ఎస్కార్ పోలీసులపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నుంచి మంగళగిరి వరకూ గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ వెళుతున్న వాహనాన్ని వెంబడించడమే కాకుండా పోలీసులపై అనుచితంగా వ్యవహరించినందు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News