Andhra Pradesh : రాజుకు సహాయ మంత్రి హోదా

మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు

Update: 2025-08-19 01:47 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు. రాజుకు సహయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017-2023 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా పని చేశారు. 22 ఏళ్లుగా రాజు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు.

సీనియర్ నేతగా...
2007-2013 మధ్య కాలంలో తెలుగుయువత కార్యదర్శిగా కూడా పనిచేశారు. తర్వాత 2013లో రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శిగా వ్యవహరించి పార్టీ అధినేత చంద్రబాబు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సమయంలో చంద్రబాబు నిర్వహించి వస్తున్నా మీ కోసం పాదయాత్రలో రాజు వాలంటీర్ల సమన్వయకర్తగా పని చేసి పాదయాత్ర సజావుగా సాగేలా తన వంతు పాత్ర పోషించారు. దీంతో ఆయనకు సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News