పులివెందుల ఎన్నికపై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

పులివెందుల ఎన్నికపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-08-09 06:15 GMT

పులివెందుల ఎన్నికపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లపై వాళ్లే దాడి చేసుకొని మాపై నిందలు వేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ వ్యక్తులే నామినేషన్ వేశారన్నారు. వైఎస్ కుటుంబ బంధువులతో నామినేషన్ వేయించారన్న బీటెక్ రవి, పోలీసులకు ఎన్నికల కమిషన్‍కు విజ్ఞప్తి చేస్తున్నానని, ఆరోజు ఏం జరిగినా తమకు సంబంధం లేదని బీటెక్ రవి తెలిపారు.

జగన్ వద్ద మెప్పు పొందేందుకు...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గర మెప్పు పొందేందుకే అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని బీటెక్ రవి చెప్పారు. ఓటర్లు షిప్టింగ్ విషయం తమకు తెలియదని, - ఓటర్ల షిప్టింగ్ విషయం ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని ఆయన చెప్పారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.


Tags:    

Similar News