తాడిపత్రిలో హైటెన్షన్.. నేడు పెద్దారెడ్డి రాక

నేడు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రానున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Update: 2025-08-18 02:25 GMT

నేడు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రానున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించడంతో తాడిపత్రిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

హైకోర్టు ఆదేశాలతో...
తాడిపత్రిలో పెద్దారెడ్డి వచ్చిన సందర్భంగా ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని హైకోర్టు స్పష్టంగా తెలిపింది. అయితే నేడు తాడిపత్రిలో శివుడి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేశారు. నేడు తాడిపత్రికి భారీగా కార్యకర్తలు తరలిరావాలని జేసీ పిలుపునివ్వడంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది.


Tags:    

Similar News