Tadipathri : నేడు తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి
నేడు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు.
నేడు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పెద్దారెడ్డిని పటిష్టమైన భద్రత మధ్య నేడు పోలీసులు తాడిపత్రికి తీసుకు వస్తారు. తాడిపత్రిలో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు మొహరించాయి.
పోలీసులు భారీ భద్రత...
అయితే పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రికి అనుమతిస్తారా? లేదా? లేక శాంతి భద్రతల సమస్య ఉందని మరోసారి అడ్డుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటివద్ద, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటివద్ద కూడా పోలీసులు భారీగా మొహరించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.