Rk Roja : నువ్వు హోం మంత్రివా? యాంకర్ వా? ఆర్కే రోజా ఫైర్
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలపై హోం మంత్రి తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పై మాట్లాడే అర్హత వీరికి లేదన్న ఆర్కే రోజా దమ్ముంటే తాను మెడికల్ కళాశాలలను చూపిస్తాను రావాలంటూ సవాల్ విసిరారు. పాడేరు మెడికల్ కళాశాలకు వెళదామా? వస్తారా అని ఛాలెంజ్ చేశారు.
మెడికల్ కళాశాల ఏర్పాటుపై...
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం ఇష్టం లేదని, మూడు దఫాలుగా ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కళాశాలను కూడా తేలేకపోయారని రోజా ఫైర్ అయ్యారు. జగన్ మాత్రం కేవలం పదిహేడు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. మీరు హోం మంతా? యాంకరా? అంటూ తీవ్ర స్థాయిలో వంగలపూడి అనితపై మండిపడ్డారు. మహిళల భద్రత, అత్యాచారాలపై మాట్లాడాలంటూ హితవు పలికారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేయడానికి ఫేక్ వీడియోలను ప్రదర్శిస్తుందని వంగలపూడి అనిత అన్నారు.