మళ్లీ సీన్‌లోకి రఘువీరా

రాజకీయాలకు విశ్రాంతి ప్రకటించిన మాజీ మంత్రి రఘువీరారెడ్డిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది

Update: 2023-04-19 03:07 GMT

కర్ణాటక ఎన్నికల్లో తెలుగు నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నాయకులు వెళ్లి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో ఎక్కువ మంది తెలుగు వారు అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. ఉపాధి కోసం వెళ్లిన వారు కూడా లక్షల్లో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు క్రియాశీలకంగా ఉంటారు. అందుకే రాజకీయ పార్టీలు కూడా తెలుగు నేతల సహకారాన్ని ప్రచారంలో తీసుకుంటుంది.

విశ్రాంతికి విరామమిచ్చి...
తాజాగా రాజకీయాలకు విశ్రాంతి ప్రకటించిన మాజీ మంత్రి రఘువీరారెడ్డిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. రఘువీరారెడ్డి కూడా తాను రాజకీయంగా క్రియాశీలకం కానున్నట్లు ప్రకటించారు. రఘువీరారెడ్డి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం నిర్వహించారు. క్రియాశీలక రాజకీయాలకు రావాలనే కోరికను మన్నిస్తున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ అండగా ఉంటూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో మనమందరం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని రఘువీరారెడ్డి పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News