Ys jagan : మార్కాపురం ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ , ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని జగన్ అన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు...
ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలన్నారు.