ఏయ్ కొల్లు రవీంద్ర.. ఏ కేసు పెట్టుకుంటావో పెట్టుకో?

కేసులకు భయపడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

Update: 2025-06-12 06:51 GMT

కేసులకు భయపడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలంటూ సవాల్ విసిరారు. తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ కేసులకు వెరవమని తెలిపారు. మాజీ మంత్రి పేర్నినానిపై నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో ఆయన అనుచరులతో ముఖ్య సమావేశమయ్యారు.

మీ టైం నడుస్తుంది...
కొల్లు రవీంద్ర అవినీతి పుంఖాను పుంఖానుగా ఉందని, సివిల్ సప్లయిస్ చరిత్రలోనే ఎవరి మీద ఇంత వరకూ కేసులు లేవని, కేవలం నామీద పెట్టారన్నారు. ప్రస్తుతం మీ టైం నడుస్తుందని, నడవనివ్వండి.. మాకూ టైం వస్తుందని తెలిపారు. ఇళ్ల స్థలాలు నకిలీ పట్టాలు ఇచ్చిన కేసులో తనను అరెస్ట్ చేస్తారంటున్నారని, అయితే తాను ఏ కేసునైనా ఎదుర్కొనడానికి సిద్ధమని పేర్ని నాని తెలిపారు.


Tags:    

Similar News