వైసీపీకి బలం నాయకులు కాదు : గుడివాడ అమర్నాధ్
వైసీపీకి బలం నాయకులు కాదని కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు
వైసీపీకి బలం నాయకులు కాదని కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని ఎదుర్కొని తాము ముందుకు వెళతామని తెలిపారు. ప్రజాసమస్యలపై తమ పార్టీ పోరాటం ఆగదని, కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పడు వ్యతిరేకిస్తుంటామని గుడివాడ అమర్నాథ్ అన్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో...
కలసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో వైసీపీ కార్యాలయం కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. ఈకార్యక్రమానికి పార్టీ నేతలుె విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తో పాటు పెద్ద సంఖ్యంలో కార్యకర్తలు పాల్గొన్నారు.