Ys Jagan : నేడు పులివెందులకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పులివెందులకు చేరుకోనున్నారు. జగన్ మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పులివెందులకు చేరుకోనున్నారు. జగన్ మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి పులివెందులకు చేరుకుని వైఎస్ జగన్ బాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు. ముఖ్య కార్యకర్తలను కూడా జగన్ కలవనున్నారు.
మూడు రోజుల పాటు...
రేపు ఉదయం వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు.వైఎస్సార్ ఘట్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తారు. తర్వాత లింగాల మండలం అంబకపల్లికి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జలహారతి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అనంతరం పులివెందులలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.రాత్రికి అక్కడే బస చేస్తారు. మూడో తేదీ ఉదయం పులివెందుల నుంచి తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. జగన్ ను కలిసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముందని భావించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.