Ys Jagan : నేడు ముఖ్యనేతలతో జగన్ భేటీ
నేడు వైసీపీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు.
నేడు వైసీపీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అక్రమ కేసులు నమోదుతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోత పెట్టడం వంటి వాటిపై నేతలతో చర్చించనున్నారు.
కార్యాచరణను...
దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో వైసీపీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన అంశంపై కూడా నేటి సమావేశంలో నేతలకు జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది.