Srisailam : శ్రీశైలానికి వరద నీరు
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది. దీంతో ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత ఇన్‌ఫ్లో 1,18,274 క్యూసెక్కులు కాగా శ్రీశైలం ఔట్‌ఫ్లో 93,115 క్యూసెక్కులు గా ఉందని అధికారులు తెలిపారు.
సాగర్ ప్రాజెక్టుకు కూడా...
అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. నాగార్జున సాగర్ ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,20,009 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 36,049 క్యూసెక్కులుకాగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 583.90 అడుగులకు చేరింది.