శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ఒక గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ఒక గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత ఇన్ ఫ్లో 73,586 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 95,677 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 883.30 అడుగులుగా ఉంది.
పర్యాటకుల సంఖ్య...
శ్రీశైలం జలాశయం కుడి, ఎడమల విద్యుత్తు కేంద్రాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేయడంతో పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో శ్రీశైలం వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు.