Srisailam : శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి కొనసాగుతుంది.
శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో శ్రీశైలం జలాశయానికి నీరు భారీగా చేరుతుంది. ప్రప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 63,086 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 67,878 క్యూసెక్కులు గా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో డ్యామ్ నిండే అవకాశముందని భావిస్తున్నారు.
మరో మూడు రోజుల పాటు...
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, శ్రీశైలం ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 193.85 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. రానున్న మూడు రోజుల్లో వరద నీరు మరింత చేరితే గేట్లు ఎత్తే అవకాశముందని తెలిసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మరొక వైపు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుంది.