Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద నీరు
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు తొమ్మిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు డ్యామ్ వద్దకు తరలి వస్తున్నారు.
గేట్లు ఎత్తి దిగువకు...
డ్యామ్ పరిసర ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,15,517 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 3,04,628 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది.