Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద నీరు

శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుతుంది.

Update: 2025-08-19 04:46 GMT

శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పద గేట్లను పన్నెండు అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,73,024 క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

విద్యుత్తు ఉత్పత్తి...
అవుట్ ఫ్లో 370,158 క్యూసెక్కులుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఎవరూ నదిలోకి దిగే ప్రయత్నం చేయవద్దని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు కు సంబంధించిన గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News