Srisailam : నిండు కుండలా శ్రీశైలం జలాశయం
శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం జలకళను తలపిస్తుంది. ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేయకపోయినా శ్రీశైలం ప్రాజెక్టు మాత్రం నిండుకుండను తలపిస్తుండటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ లో ఎక్కువ మంది పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు.
వరద నీరు చేరడంతో...
దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,52,788 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 67,617 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా, శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులుగా ఉందని, కుడి, ఎడమల జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది.