గోదావరికి పోటెత్తుతున్న వరద నీరు
గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి రెండు లక్షల క్యూ సెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి రెండు లక్షల క్యూ సెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన కరుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు పెరగడంతో గేట్లన్నింటినీ ఎత్తివేశారు. గోదావరి ఉప నదులు గౌతమి, వశిష్ట వంటివి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి నది నీటికి వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద...
ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణలలో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు పెరుగుతుంది. పది లక్షల క్యూ సెక్కుల వరకూ విడుదల చేస్తేనే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ప్రభుత్వం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు.