Srisailam : శ్రీశైలం జలాశయం వద్ద పర్యాటకుల సందడి

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది.

Update: 2025-09-25 04:27 GMT

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లోనూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను పన్నెండు అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదలు చేస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 2,73,958 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు.

పది గేట్లు ఎత్తి...
ఔట్ ఫ్లో 3,71,451 క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం కుడి, ఎడమల జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది. దసరా సెలవులు కావడంతో శ్రీశైలం వచ్చే భక్తులందరూ ప్రాజెక్టు వద్ద ఆగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముందని భావించి, ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను నియమించారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రభావం ప్రాజెక్టుకు కూడా పర్యాటకుల రూపంలో కనిపిస్తుంది.


Tags:    

Similar News