Srisailam : శ్రీశైలం జలాశయానికి వరదనీరు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు వరదనీరు కొనసాగే అవకాశముందని తెలిపారు.
పర్యాటకుల సంఖ్య
శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ ఫ్లో 12,60,615 క్యూసెక్కులుగా ఉందని, అవుట్ ఫ్లో 2,50,230 క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గత కొద్ది రోజులుగా పర్యాటకుల సంఖ్య పెరగడంతో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమల జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది.