మున్నేరు వాగుకు పెరుగుతున్న వరద

మున్నేరు వాగుకు వరద ఉద్ధృతి పెరుగుతుంది. జగ్గయ్యపేట-ఖమ్మం ప్రాంతాల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారింది

Update: 2025-09-02 03:02 GMT

మున్నేరు వాగుకు వరద ఉద్ధృతి పెరుగుతుంది. ఉదయం నుంచి క్రమంగా మున్నేరుకు పెరుగుతున్న వరద మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మున్నేరు వాగుకు ప్రస్తుతం 25 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. లింగాల వద్ద లోలెవెల్ వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తుంది.

జగ్గయ్యపేట-ఖమ్మం ప్రాంతాలను...
జగ్గయ్యపేట-ఖమ్మం ప్రాంతాలను కలుపుతున్న లోలెవల్ వంతెన ఉండటంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశముందని చెబుతున్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. వంతెనపై నీరు ప్రవహించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ లక్ష్మీశ వరద పెరిగే అవకాశమున్నందున వాగు పరిసరాల్లోకి వెళ్లవద్దని సూచించారు.


Tags:    

Similar News