Tirumala : శ్రీవారిని ఐదడుగుల దూరంలోనే దర్శనం.. ఘరానా మోసగాడి అరెస్ట్
తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లోగోతో నకిలీ ప్రకటనలు ఇస్తూ శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒక్కొక్క టిక్కెట్ ను...
తిరుమలలో గర్భగుడిలో శ్రీవారిని ఐదు అడుగుల దూరం నుంచి దర్శనమంటూ మోసం చేస్తున్నాడు. ఒక్కో టికెట్‌కు 16,500 రూపాయల వరకు వసూలు చేసిన నిందితుడు అనేక మందికి బురిడీ కొట్టించాడు. నిందితుడు సెంథిల్ కుమార్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన తిరుమల పోలీసులు ల్యాప్‌టాప్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.