Srisailam : శ్రీశైలం జలాశాయానికి పెరుగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది.

Update: 2025-07-22 02:19 GMT

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది. దీంతో జలాశయం నిండు కుండను తలపిస్తుంది. నీటితో నిండిన ప్రాజెక్టును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం మల్లన్న ను దర్శించుకున్న భక్తులు ప్రాజెక్టును కూడా దర్శించుకోవడంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రస్తుత నీటి మట్టం...
జూరాల నుంచి 63,270 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 39,105 క్యూసెక్కులు వరద నీరు వచ్చి శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం 883.40 అడుగులకు చేరింది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 206.9734 టీఎంసీలుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.


Tags:    

Similar News