Srisailam : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని నీటిపారుదలశాఖ అధికారులు విడుదల చేస్తున్నారు

Update: 2025-09-01 02:19 GMT

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని నీటిపారుదలశాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత ఇన్‌ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

ఎనిమిది గేట్లు ఎత్తి...
శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఔట్‌ఫ్లో 2.82 లక్షల క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారుల వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 882 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమల జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది. డ్యామ్ వద్దకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.


Tags:    

Similar News