పవన్ కల్యాణ్ పై ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ పై సినీనటుడు ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు
పవన్ కల్యాణ్ పై సినీనటుడు ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమను గౌరవించినందుకు రేవంత్‌కు ధన్యవాదాలు చెబుతూనేఆంధ్రప్రదేశ్ లోనూ అవార్డులు ప్రకటించాలని ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. పవన్ ఆఫీస్ ప్రకటన, దుర్గేష్ వ్యాఖ్యలు సరికాదన్న నారాయణమూర్తి కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. థియేటర్ల బంద్ అని ఎవరూ ప్రకటించలేదని, బంద్ ప్రకటిస్తే మూడు వారాల ముందే నోటీసులు ఇస్తారని ఆర్.నారాయణమూర్తి అన్నారు.
ఎవరు కుట్ర చేశారు?
హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారని ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. పవన్‌పై ఎవరు కుట్ర పన్నగలరని నారాయణమూర్తి అన్నారు. టికెట్ రేట్లు పెంచొద్దని కూడా చెప్పామన్న నారాయణమూర్తి రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారన్నారు. సింగిల్ థియేటర్లకు పర్సంటేజ్ విధానం కావాలని, అద్దె విధానం తొలగించాలని ఎప్పుడో డిమాండ్ చేశానని చెప్పారు. పర్సంటేజ్ విధానానికి దిల్‌రాజు ఒప్పుకున్నారంటూ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు.