హైకోర్టులో రైతులకు ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. రైతులు వేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది

Update: 2022-10-27 08:18 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. రైతులు వేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అమరావతి టు అరసవిల్లి పాదయాత్రపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. రైతుల పాదయాత్రకు అనుమతిస్తూ కొన్ని ఆంక్షలు విధించారు. 600 మంది రైతుల కంటే ఎక్కువ మంది పాల్గొన రాదని, మద్దతిచ్చే వారు రహదారి పక్కన ఉండి మద్దతు తెలపాలని తీర్పు చెప్పారు.

ఆంక్షలను ఎత్తివేయాలంటూ...
దీంతో పాటు రైతులు తమ ఐడీ కార్డులను కూడా చూాపలని హైకోర్టు ఆదేశించింి. అయితే సింగిల్ జడ్జి ఆదేశాల్లోని ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రెగ్యులర్ బెంచ్ కు వెళ్లాలని ఆదేవించింది. దీనిపై రెగ్యులర్ బెంచ్ లో పిటీషన్ ను విచారించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది.


Tags:    

Similar News