ఢిల్లీకి బయలుదేరిన రాజధాని రైతులు

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం ఈ నెల 17వ తేదీతో మూడేళ్లు కావస్తుంది

Update: 2022-12-15 08:38 GMT

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం ఈ నెల 17వ తేదీతో మూడేళ్లు కావస్తుంది. దీంతో రైతులు పెద్దసంఖ్యలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మూడేళ్ల తమ ఉద్యమ అంశాలను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి భారీ సంఖ్యలో ఢిల్లీకి అమరావతి రైతులు బయలుదేరి వెళ్లారు.

రాజధానిగా కొనసాగించాలంటూ...
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వివిధ పార్టీల నేతలను రైతులు కలవనున్నారు. అలాగే జంతర్ మంతర్ వద్ద ధర్నా కు దిగనున్నారు. హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో రైతులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వారికి మద్దతు పలికారు.


Tags:    

Similar News