పాదయాత్రలో రైతుల ఆగ్రహం.. అందుకేనట

రాజమండ్రి లోకి పాదయాత్ర ప్రవేశిస్తుండటంతోనే రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిని మూసేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2022-10-14 04:49 GMT

అమరావతి రైతుల మహాపాదయాత్ర 33వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గంలో యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర మునిపల్లె నుంచి ముప్ప వరకూ నేడు కొనసాగనుంది. మొత్తం పదిహేను కిలోమీటర్ల మేరకు ఈరోజు యాత్ర కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. రైతుల మహా పాదయాత్రకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐలు తమ జెండాలతో సంఘీభావాన్ని చెబుతున్నాయి.

బ్రడ్జిని మూసివేసి...
అయితే త్వరలో రాజమండ్రి లోకి పాదయాత్ర ప్రవేశిస్తుండటంతోనే రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిని అధికారులు మూసేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల పాటు మరమ్మతుల కోసం బ్రిడ్జిని మూసివేస్తున్నామని అధికారులు ప్రకటించడం అన్యాయమని అన్నారు. యాత్రకు ఆటంకం కలిగించాలని వంతెన మీదుగా వెళ్లకుండా అడ్డుకోవడానికే మరమ్మతుల పేరిట మూసివేస్తున్నట్లు ప్రకటించారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తమ యాత్ర మాత్రం అరసవిల్లి వరకూ శాంతియుతంగా కొనసాగుతుందని వారు చెప్పారు.


Tags:    

Similar News