నేటి నుంచి కస్టడీకి జోగి రమేష్

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను నేటి నుంచి ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించనున్నారు

Update: 2025-11-26 03:54 GMT

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను నేటి నుంచి ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. నెల్లూరు సబ్ జైలు నుంచి జోగి రమేష్ ను నేడు విజయవాడకు తీసుకురానున్నారు. ములకల చెరువులోనూ, ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ వెనక ఎవరున్నారన్నదానిపై విచారణ చేయనున్నారు.

ప్రధాన కారణాలపై...
ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్మోహనరావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆయనకు వారితో ఎలాంటి సంబంధాలున్నాయి? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? ఇబ్రహీంపట్నం లో నకిలీ మద్యం డంప్ వెనక ఉన్నదెవరు అన్న వాటిపై నేడు ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు జోగి రామును కూడా ఈకేసులో నేటి నుంచి నాలుగు రోజుల పాటు విచారించనున్నారు.


Tags:    

Similar News