Kesineni Nani : కేశినేని లేటెస్ట్ ట్వీట్ లో ఎన్నో ప్రశ్నలు?
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వరస ట్వీట్లతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వరస ట్వీట్లతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. విశాఖలో అతి తక్కువ ధరకు భూముల కేటాయించడంపై ఆయన ప్రతిరోజూ ప్రశ్నలు సంధిస్తూ టీడీపీతో పాటు ఆయన సోదరుడు కేశినేని చిన్ని ని కూడా రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా మరో ట్వీట్ తో కేశినేని నాని మరోసారి విశాఖ భూముల కేటాయింపులపై ప్రశ్నలు సంధించారు.
తాజా ట్వీట్ ఇదే...
"దీనికేమి సమాధానం చెపుతావు బాబు సతీష్ అబ్బూరి...నువ్వు నీ మిత్రుడు చార్లెస్ శోభ రాజ్ కలసిఇరవై ఒక్క సెంచరీ ద్వారా ఎంతో మందిని మోసం చేసింది వాస్తవం , ఇప్పుడు ప్రజా సంపద దోచుకుందామని ఉర్సాను పెట్టింది కూడా నిజం . చేసేది పచ్చి మోసాలు పైగా బెదిరింపులు" అంటూ మరో ట్వీట్ ను కేశినేని నాని చేశారు.