తాడిపత్రిలో మళ్లీ టెన్షన్

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది.

Update: 2025-06-14 04:15 GMT

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. తాడిపత్రి నియోకవర్గంలో పర్యటించడానికి పెద్దారెడ్డి సిద్ధం కావడంతో పోలీసులు అందుకు అనుమతించలేదు. ఇంటి నుంచి బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అనుమతించేది లేదని పోలీసులు చెబుతన్నారు.

పెద్దారెడ్డిని అడ్డుకోవడంతో...
అయితే పెద్దారెడ్డి మాత్రం తనను చూసి భయపడి జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాలను, రైడీలను అడ్డం పెట్టుకుని తనను తాడిపత్రిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇంత భయం ఎందుకని పెద్దారెడ్డి ప్రశ్నించారు. మరొక వైపు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని జేసీ వర్గీయులు చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యార.


Tags:    

Similar News