జగన్ దోపిడీకి అందరూ బలి
ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత జగన్ ఏ వర్గానికి న్యాయం చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు
ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత జగన్ ఏ వర్గానికి న్యాయం చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. జగన్ దోపిడీకి అన్ని వర్గాల వారూ బలవుతున్నారన్నారు. ఓటీఎస్ కూడా జగన్ దోపిడీలో భాగమేనని చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఓటీఎస్ పథకాన్ని నిరసిస్తూ చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక.....
ఓటీఎస్ పథకం ద్వారా పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. పేద ప్రజలు ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు జగన్ ఇప్పుడు ట్యాక్స్ వేస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓటీఎస్ పథకాన్ని రద్దు చేసి ఉచితంగా పేదలందరికి తమ ఇళ్లపై హక్కు కల్పిస్తామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.